దశార్ణదేశపు హంసలు

ఒక రచన చేరవలసిన చోటుకి చేరిందని తెలిసినప్పుడు ఏ రచయితకైనా కలిగే సంతోషం మామూలుగా ఉండదు. గంటేడ గౌరునాయుడు నా 'దశార్ణదేశపు హంసలు' పుస్తకం లింక్ పంపమంటే పంపాను. ఈ రోజు ఆయన చేతుల్లో నిలువుటద్దం సైజులో ఆ పుస్తకం కనిపిస్తే ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను.

దశార్ణ దేశపుహంసలు

అందుకని, మొదటగా, తెలుగు సాహిత్యం మీద ఇప్పటిదాకా రాసిన వ్యాసాల్ని పుస్తకరూపంలో అందివ్వాలని అనుకున్నాను. వాటితో పాటు, ఈ మధ్యకాలంలో రాసిన కొన్ని సమీక్షలూ, ముందుమాటలూ కూడా కలిపి 125 వ్యాసాలతో 'దశార్ణ దేశపు హంసలు' పేరిట ఇలా పుస్తకరూపంలో అందిస్తున్నాను.