బసవపురాణంలో ముగ్ధభక్తుల కథల గురించి చేస్తూ వచ్చిన ప్రసంగాలకు కొనసాగింపుగా ఇవాళ బసవణ్ణ భక్తి గురించిన ప్రసంగం.. బసవణ్ణది ముగ్ధభక్తి కూడా. ముగ్ధభక్తులు శబ్దప్రమాణాన్నే విశ్వసించి నడుచుకున్నారు. పెద్దలు శివుడి గురించి ఏ మాట చెప్తే ఆ మాటనే వాళ్ళు శిరోధార్యం చేసుకున్నారు. బసవణ్ణ కూడా అలానే తన గురువు సంగమయ్య తనకు చేసిన ఉపదేశానికి అనుగుణంగానే తన నడవడికను, తన వాక్కుని రెండింటినీ తీర్చిదిద్దుకున్నాడని బసవపురాణం చెప్తున్నది. ఆ విశేషాలు ఈ రోజు ప్రసంగం.
పావన దర్శనం
డావోని తెలుసుకోవడం కోసం ఆమె ‘వూవెయి’ చెయ్యిపట్టుకుని నడిచారనీ, ఒకసారి ఆ దారమ్మట నడిచి వచ్చ్చాక, ఆ మార్గాన్ని సాకల్యంగా చూసుకున్నాక, ఇప్పుడు మనల్ని తన వెంట తీసుకువెళ్ళడానికి, ఈ పుస్తకంతో మనముందు నిలబడ్డారనీ చెప్పవచ్చు.
ఈ పుస్తకం ఒక దీపం
ఇటువంటి పరిస్థితులే ఈ రోజు మన చుట్టూతా కూడా ఉన్నాయనీ, లేనిదల్లా కన్ ఫ్యూషియస్ లాంటి వివేకి, దయార్ద్రహృదయుడే అని మనం గ్రహించగలుగుతాం.
