నడుస్తున్న కాలం-6

మొత్తం మీద మన సమాజమూ, ప్రభుత్వాలూ గుర్తించవలసిన సత్యం ఒక్కటే: అదేమంటే, పిల్లల సినిమా అనేది ఒక జానర్ కాదు, మన సమాజం పిల్లల ప్రపంచాన్ని ఎంత గౌరవిస్తున్నదో చూపించే ఒక సూచిక. ఈ నిష్ఠుర సత్యం పట్ల ఒక్క అనిల్ బత్తుల మాత్రమే కాదు, పిల్లల ప్రేమికులు ప్రతి ఒక్కరూ మేల్కొనవలసి ఉంది.