కానీ చాలా జీవితాలు పతాకకి చేరుకోకుండానే ముగిసిపోతాయి. మనుషులు మరణించేది, గొప్ప ఉద్రేకావస్థలో తీవ్ర స్థితికి చేరుకున్నాక కాదు, చాలా సార్లు, ఒక ఉత్తరం రాయడం మర్చిపోయి మరణిస్తారు. ఆర్కిటెక్చరంటూ ఏదీ లేదు. ఉన్నదంతా ఒక చిత్తుప్రతి, ఎన్నిసార్లు మూసినా సరిగ్గా మూసుకోని తలుపు.
కథకుల గురువు
మొన్న ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆంటోన్ చెకోవ్ కథలు-2 ఆవిష్కరణ సందర్భంగా చేసిన ప్రసంగం. కుమార్ కూనప రాజు గారికి మరో మారు ధన్యవాదాలు.
వ్యథార్థ దృశ్యం
పశ్చిమ గోదావరి జిల్లా అంటే నా చిన్నప్పడు కొంత వినీ, కొంత చూసీ ఊహించుకున్న మనోహర దృశ్యమొకటి నిన్నమొన్నటిదాకా నా కళ్ళముందు కదలాడుతూ ఉండేది. కాని అది నాకు తెలీకుండానే నెమ్మదిగా కరిగిపోతూ, చివరికి, మూడేళ్ళ కిందట కొల్లేరు వెళ్ళినప్పుడు పూర్తిగా అదృశ్యమైపోయింది. నామిత్రుడు, ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి, ఆకివీడు మండలంలో ఒక పాఠశాల దత్తత తీసుకుని దాని రూపురేఖలు మార్చేసాడు. ఆ పాఠశాల చూడటానికి రెండేళ్ళ కిందట నన్ను తీసుకువెళ్ళినప్పుడు, పశ్చిమగోదావరి తీరప్రాంతం మొత్తం ఒక …
