ఆ ద్రవీకరణసామర్థ్యం టాగోర్ దా, చలంగారిదా, లేక ఇప్పటికే కరిగిపోయిన నా హృదయానిదా చెప్పలేను. కాని, ఇదిగో, ఈ ఫాల్గుణ ప్రభాతాన్న ఏ పుట తెరిచినా నా హృదయాన్ని ఊడబెరికి బయటకు లాక్కున్నట్టే ఉంది.
ఆ సముద్రపు ఒడ్డున
అదేమంటే, నీలో రెండుంటాయి, నువ్వూ, గురువూ, నువ్వు పక్కకి తప్పుకుని గురువు మాత్రమే మిగలడం 'సుధ' అని.
భావన: చలం
రచయితగా మొదలై ఒక మిస్టిక్ గా పరిణామం చెందిన చలంగారి ఆలోచనలను స్మరిస్తూ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి సుప్రభాత భావన కోసం వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
