ఉత్తమ ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుడు అన్నిటికన్నా మించి ఒక presence. అతడు తరగతి గదిలో అడుగుపెట్టగానే ఒక సువాసన ఆ గదిలో వీచినట్టుగా ఉండాలి. అతడు నోరుతెరవకముందే అతడి చూపులే పిల్లల్తో మాట్లాడటం మొదలుపెట్టాలి. అతడు చెప్పే పాఠంలోని విషయంకాదు పిల్లల్ని కట్టిపడేసేది, అసలు అతడు ఏం మాట్లాడినా పిల్లలు మంత్రముగ్ధులై పోగలగాలి.

సమగ్రంగా వికసించిన పాఠశాల

ఆ పసివయసులో చందమామ పత్రిక నాకేమి చెప్పిందంటే, ఆ ఇద్దరు చంద్రుళ్ళూ కూడా నిజమేనని. ఒకరికొకరు విరుద్ధం కారని. నవీన చంద్రుడు నా బుద్ధిని ఆకర్షిస్తాడు. పురాణ చంద్రుడు నా మనసుని దోచేసుకున్నాడు