ఒక విముక్తక్షణం

మనిషి స్వాతంత్య్రానికి అన్నిటికన్నా పెద్ద శత్రువు పిరికితనం అని చెప్పగలనుగాని, తీరా దాన్ని వదుల్చుకుందాం అనుకునేటప్పటికి అది ఎన్ని సూక్ష్మరూపాల్లో మనల్ని అంటిపెట్టుకుని ఉంటుందో బొమ్మలు వెయ్యడానికి కూచుంటే తప్ప తెలియదు.