రినైజాన్సు యూరోప్ మూడువందల ఏళ్ళు కాకుండానే తాను నరహంతక భూమిగా మారడమే కాక, ప్రపంచాన్నే వథ్యశిలగా మార్చిన నేపథ్యంలోంచి బైరాగి కవిత్వం చెప్పాడు. మానవ చరిత్రలో గొప్ప ఆశలు రేకెత్తించి, అత్యంత దారుణంగా విఫలమైన (గ్లానిలో అవసానమొందినదా అహంకృత సింహనాదం) యుగానికి అటువైపు బొకాషియో, షేక్ స్పియర్, మాంటేన్లు ఉంటే ఇటువైపు బైరాగి, పద్మరాజులు నిలబడ్డారు.
ఆ రెండూ కలిసి ఒక జ్ఞాపిక
ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘంవారు 2015 సంవత్సరానికి ఆలూరి బైరాగి పురస్కారం నాకు అందించినప్పుడు మళ్ళా అట్లానే అనిపించింది. ఆ సంకల్పం లక్ష్మీప్రసాద్ గారిదో, పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావుగార్లదో అనుకోవడం లేదు నేను.
శిలలలో మెడొనా
నిన్న సాయంకాలం ఆదిత్య మా ఆఫీసుకి వచ్చాడు. అతడు బాగులోంచి ఆగమగీతి బయటకు తీస్తుండగానే గుర్తొచ్చింది, బైరాగి (1925-79) పుట్టినరోజని. ముఫ్ఫై ఏళ్ళకిందట నేను బైరాగి కవిత్వాన్ని ఆరాధించినదానికన్నా అతడిప్పుడా కవిత్వాన్ని మరింత ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు.
