ప్రళయాంతవేళ

ప్రళయం ముంచెత్తిన ప్రతి యుగాంతవేళా, నాతో పాటు, వటపత్రప్రమాణంకలిగిన కించిదూర్జిత స్ఫూర్తికూడా ఒకటి జీవించి ఉండటం కనుగొన్నాను

ఎర్రక్రీస్తు-2

గతవారం బైరాగి 'ఎర్రక్రీస్తు' కవితమీద నా ఆలోచనలకు ప్రతిస్పందించిన మిత్రులందరికీ నా అభినందనలు. అయితే ఆ కవితమీద, నా వ్యాఖ్యానం మీద కొందరు మిత్రులు ప్రకటించిన సందేహాలకు కొన్ని వివరణలు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను.

ఎర్రక్రీస్తు-1

ఆధునిక తెలుగు కవిత్వం క్రీస్తునొక మానవాతీత ప్రతీకగా చిత్రించడంలో ఆసక్తి చూపించింది. కాని బైరాగి క్రీస్తు జీవితంలోని అశక్తక్షణాల్ని పట్టుకున్నాడు. ఆ అశక్తక్షణాల్లో, క్రీస్తు కూడా మనలానే మామూలు మనిషిగా భావించిన క్షణాల్లో అతడి మనోవేదన ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు.