పగిలిన కుండలోపలి ఖాళీస్థలం ఆకాశంలో కలిసిపోయినట్టు యోగి దేహం విడిచినప్పుడు పరమసత్యంలో కలిసిపోతాడు.
అవధూత గీత-10
సారాసారాల్ని దాటి ఉన్నదేదో, రాకపోకల్ని దాటినదేదో ఆ నిర్వికల్ప, నిరాకుల, శివస్వరూపంగా ఉన్నది నేనే.
అవధూత గీత-9
ప్రకాశిస్తూనే ఉంది ఈ సమస్త ప్రపంచం ఎడతెగకుండా, ఎక్కడా తెంపులేకుండా! ఆహా! ఎటువంటిది ఈ మాయ! రెండనీ రెండుకాదనీ భ్రమలు కల్పిస్తూనే ఉన్నది.
