కాని కాలం జాతీయోద్యమ కవుల పక్షానే నిలిచింది. తర్వాత రోజుల్లో తిరిగి మళ్ళా ప్రజలు తమ సాంఘిక, రాజకీయ అసంతృప్తిని, అసమ్మతిని ప్రకటించడానికి గరిమెళ్ళ బాటనే పట్టారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండులు మొదలుకుని గద్దర్ దాకా కూడా ఒక అవిచ్ఛిన్న గేయకారపరంపర కొనసాగుతూ వస్తున్నదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు
జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-1
జాతీయోద్యమ స్మృతి పట్ల నేడు ప్రజల కనవస్తున్న సమాచారలోపానికీ, నిరాసక్తతకీ ప్రధాన కారణం మన విద్యావ్యవస్థలోనూ, మన చరిత్ర రచనలోనూ ఉందని చెప్పవచ్చు. కాని జాతీయోద్యమ సాహిత్యం పట్ల మన అజ్ఞానానికి కారణమేమై ఉంటుంది?
అభినందనలు
. ఈ దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి కావాలనీ, హింసతో నిమిత్తం లేకుండా సమానతను సాధించగలగాలనీ, ద్వేషపూరితమైన నేటికాలంలో నిజమైన శాంతిఖండంగా విలసిల్లాలనీ మనం కోరుకుంటున్నాం. ఆ కోరిక చాలు. మనల్ని ముందుకు నడిపించడానికి.
