నిన్నంతా ఒక సహృదయుడు రాసిన ప్రేమ లేఖల్ని చదివుతూ గడిపేను. ఔను అవి ప్రేమలేఖలే. ఎంతో ఆర్తితో, మరెంతో బాధ్యతతో రాసిన ప్రేమలేఖలవి. కవీ, రచయిత, చిత్రకారుడూ, పిల్లలప్రేమికుడూ అయిన ఒక భావుకుడు తాను దర్శించిన ప్రయోగాత్మక పాఠశాలలగురించి రాస్తే వాటిని ప్రేమలేఖలు అనకుండా మరేమంటాను! అని అంటున్నారు గంటేడ గౌరునాయుడు. ఎందుకో ఈ లింక్ తెరిచి చూడండి:
ఆ వెలుగుల కోసమే
ఈలోగా గత పుష్కరకాలంగా నేను అప్పుడూ అప్పుడూ మిత్రుల్తో పంచుకుంటూ వస్తున్న నా విద్యానుభవాల్ని ఒక సంపుటంగా వెలువరించాలనుకున్నాను. ముఖ్యంగా మా దేవమ్మ డా.నన్నపనేని మంగాదేవిగారికి ఆ పుస్తకం కానుక చెయ్యాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. నిన్న శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వారి లలితకళా ఉత్సవంలో ఈ పుస్తకాన్ని మా అక్క ఆవిష్కరించి నా తరపున ఆమెకు సమర్పించింది. ఇది నా 51 వ పుస్తకం. దీన్నిక్కడ ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. 45 వ్యాసాలు. 216 పేజీలు. దీన్ని మీ మిత్రుల్తో, మీ సంస్థల్లో, మీ ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తల్తో, ఉపాధ్యాయుల్తో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
