ఆంధ్రీకుటీరం చేస్తున్న విద్యావితరణ

ప్రపంచం రెండు విధాలుగా ఉంది. చుట్టూ ఉన్న వ్యవస్థల్ని విమర్శిస్తూ వుండే ప్రపంచమొకటి. 'చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూచోకుండా ప్రయత్నించి చిన్నదీపమేనా వెలిగించే' వాళ్ళ ప్రపంచం మరొకటి. కిరణ్ మధునాపంతుల ఈ రెండో తరహా ప్రపంచానికి చెందిన మనిషి. 

ఈశవిద్య

నేను సద్గురు జగ్గీవాసుదేవ్ అనుయాయిని కాను, ఆయన బోధనలపట్లా, సంభాషణలపట్లా నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. ఆయన చెప్పే క్రియాయోగాన్ని అనుసరించడానికి ఆయన పట్ల గొప్ప నమ్మకం ఉండాలి, లేదా ఆయన్ని విమర్శించాలంటే, ఆయన ప్రత్యర్థుల్లాగా, ఆయన పట్ల బలమైన అనుమానాలేనా ఉండాలి. నాకు ఆ నమ్మకమూ లేదు, ఆ అనుమానాలూ లేవు.

గారపెంట ఆశ్రమపాఠశాల

గారపెంట ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఒక మారుమూల చెంచుగూడెం. సుమారు ఇరవయ్యేళ్ళ కిందట మొదటిసారి ఆ వూరువెళ్ళాను. పుల్లలచెరువునుంచి అడవిబాటన అక్కడికి ఒక రోడ్డు వేయించాము. అక్కడొక ఆశ్రమపాఠశాల ఉంది. నల్లమల ప్రాంతంలో చదువుకుని పైకి వచ్చిన చెంచుయువతీ యువకులు ఆ ఊళ్ళోనే ఎక్కువ మంది కనిపించారు నాకు.