ఆ వెన్నెల రాత్రులు-9

నిజమే, నేను సైంటిస్టునే. అది నా అబ్జర్వేషన్స్ లో. వాటిని అనలైజ్ చెయ్యడంలో. కానీ నా అనుభూతిలో నేనొక మిస్టిక్ ని. ఒక జియాలజిస్టు జీవితంలో ఏదీ డ్రమటిక్ కాదు. కాని నాలాంటివాడికి ప్రతి ఒక్కరోజూ పొయెటిక్ గానే ఉంటుంది.

ఆ వెన్నెల రాత్రులు-8

నిజానికి నేను అటువంటి ఒక తావుకు చేరుకోవాలనే ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాననీ, ఎట్టకేలకు ఆ తావుకి చేరుకున్నాననీ అప్పుడే తెలుసుకున్నాను. నువ్వు చేరుకోవలసిన తావుకి చేరుకున్నట్లు తెలియడానికి గుర్తు అదే: మాటలు ముగిసిపోయి, మౌనం మొదలుకావడం.

ఆ వెన్నెల రాత్రులు-7

ఒక చంద్రోదయం ఒక ప్రపంచం మీద ఇంత మంత్రజాలం చెయ్యగలదని నాకెప్పుడూ తట్టలేదు. ఆ క్షణాన నేనేమి చూసాను? నాకేమి జరిగింది? చెప్పలేను. కాని ఆ రోజు నేను దేవగంగాస్నానం చేసాను. నేను అంతకు ముందు ఎప్పుడూ అంత నిర్మలమైన జలాల్లో నిలువెల్లా మునిగిందిలేదు, ఆ తర్వాత, ఇప్పటిదాకా, కూడా లేదు.