నిప్పులు చెరుగుతున్న మధ్యాహ్నపు ఎండలో జామినీ రాయ్ చిత్రలేఖనాల అరుదైన ప్రదర్శన చూడటం కోసం సాలార్ జంగ్ మూజియానికి వెళ్ళాను. వారం రోజులనుంచీ అనుకుంటున్నది ఇవ్వాళ్టికిసాధ్యపడింది. అకాశానికీ భూమికీ మధ్య నగరమొక వేణ్ణీళ్ళ బానలాగా మరుగుతూండగా, కార్లు, ఆటోలు,బస్సులు వదులుతున్న వేడి పొగ నిట్టూర్పుల మధ్య నేనొక్కణ్ణీ మూజియానికి వెళుతూండగా నన్ను చూసి నాకే నవ్వొచ్చింది.
ఎమిల్ నోల్డె
ఎమ్మెస్ తన కవితాసంపుటి 'శబ్దభేది'కి ముఖచిత్రం వెయ్యమని అడిగినప్పుడు ఒక పువ్వూ, దానిమీద వాలిన ఒక సీతాకోకచిలుకా స్ఫురించాయి. వాటిని నీటిరంగుల్లో ఎమిల్ నోల్డె లాగా చిత్రించాలని కూడా అనిపించింది.
మోండ్రియన్ పూల బొమ్మలు
ఇప్పటి మన చిత్రకారులెవ్వరూ పూలబొమ్మలు గియ్యరు. ప్రసిద్ధ ఆధునిక తెలుగు చిత్రకారులు గీసిన పూలబొమ్మలేవీ నేను చూడలేదు. పూలబొమ్మలు గియ్యడం కూడా figurative art కిందకే వస్తుందనీ, అది చాలా తక్కువస్థాయి చిత్రకళ అనీ ఆధునిక చిత్రకారులు భావిస్తూండవచ్చు. ఆకృతిని నిరాకరించి, నైరూప్యం వైపు ప్రయాణం మొదలయ్యాక, తమ మనోసీమలో ఘూర్ణిల్లే రకరకాల విరూపాకృతులకి వ్యక్తీకరణనివ్వడమే తమ సాధనగా,తమ కళాసాఫల్యంగా భావిస్తున్నారు మన చిత్రకారులు.
