ఇదంతా చదివిన తరువాత మీకేమనిపిస్తున్నది? మనం కవిత్వాన్ని చదవవలసినట్టుగా చదవడం లేదనే కదా. కవిత్వం చదవడానికి మనకి కావలసింది అన్నిటికన్నా ముఖ్యం కాలం. ప్రతి ఒక్క పదప్రయోగం దగ్గరా ఆగిపోగలిగే, జీవితాన్ని అంకితం చేయగలిగే మనఃస్థితి. ఇప్పుడు మనకి కావలసింది, మరింత మంది కవులు కాదు, మహాకవులు అసలే కాదు, మనకి కావలసింది పాఠకులు.
రాజకీయాల్ని దాటిన దర్శనం
క్రొస్నహోర్కాయి దర్శనాన్ని ఇంతకన్నా బాగా వివరించడం కష్టం. మరొక పత్రిక రాసినట్టుగా, he is offering perspective more than politics. He has a worldview to show us, so it falls upon us to 'simply look and be silent'.
నన్ను వెన్నాడే కథలు-10
ఆయన రాసిన కథ 'ఆంజనేయస్వామివారు.' మరాఠీ కథాసంగ్రాహంలోని ఈ కథ నలభయ్యేళ్ళ కిందట మొదటిసారి చదివినప్పుడు నాకు ఎంత కొత్తగా అనిపించిందో, ఇప్పుడూ, అంతే తాజాగా ఉంది.
