మీకు కొన్ని సంగతులు చెప్పాలి

'ద పొయెట్రీ ఆఫ్ అవర్ వరల్డ్ ' (పెరిన్నియల్, 2000) చాలా విలువైన పుస్తకం. ' ద వింటేజి బుక్ ఆఫ్ కాంటెంపరరీ వరల్డ్ పొయెట్రీ ' (1996), 'వరర్ల్డ్ పొయెట్రీ' (నార్టన్,1997) లతో పాటు ప్రతీ రోజూ నాకు నా స్పూర్తినివ్వడానికి నా బల్లమీద పెట్టుకునే పుస్తకంగా మారిపోయింది.

టోనీ మారిసన్

'వట్టి నవల మటుకే కాదు, అది కథలాగా, కావ్యంలాగా, నాటకంలాగా కూడా ఉండాలి,అట్లాంటి రచన ఒకటి రాయాలనుకుంటున్నాను 'అని చెప్పాడట టాల్ స్టాయి 'వార్ అండ్ పీస్' నవల రాయబోతూ. టోనీ మారిసన్ నవల Beloved (1987) ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యానికొక వార్ అండ్ పీస్, ఒక ఒడెస్సీ, ఒక పారడైజ్ లాస్ట్.

రాల్ఫ్ ఎల్లిసన్

ఈ వ్యాసాలు మొదలుపెట్టినప్పుడు Invisible Man గురించి కూడా రాస్తున్నావు కదా అని కన్నెగంటి రామారావు అడిగినప్పటినుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను, ఒక చిన్న పరిచయంలో ఆ నవలకు న్యాయం చేయగలనా అని. ఒక వ్యాసం కాదు, ఒక గోష్టి కావాలి