వెనకటికి తమిళదేశంలో శాత్తనార్ అనే కవి ఉండేవాడట. మణిమేఖలై మహాకావ్య కర్త. అతడు చెడ్డ కవిత్వం వినవలసి వచ్చినప్పుడల్లా తలబాదుకునేవాడట. అట్లా బాదుకుని బాదుకునీ ఆ తల పుండైపోయిందట. శీత్తలై (చీముతల) శాత్తనార్ అంటే తలపుండైపోయినవాడు అని అర్థం.
బ్రెజిల్ కవులు
'కవులన్నా, కవిత్వమన్నా బ్రెజిల్లో గొప్ప గౌరవం.ఆ మనిషి వ్యాపారస్థుడు గానీ,రాజకీయవేత్తగానీ, అసలతడికి కవిత్వంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా,అతణ్ణి ఆదరంగా పలకరించవలసి వచ్చినప్పుడో, లేదా ప్రశంసించవలసి వచ్చినప్పుడో, కవీ అని పిలవడంలో వాళ్ళకో సంతోషం..'
డెరెక్ వాల్కాట్
కవి, నాటక కర్త, చిత్రకారుడు, డెరెక్ వాల్కాట్ (1930-2017) మొన్న మరణించాడు. కరీబియన్ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తీసుకువచ్చిన సమకాలిక కవి. సుమారు నాలుగుకోట్ల జనాభా ఉన్న 25 కరీబియన్ దీవులనుంచి సాహిత్యంలో నోబేల్ పురస్కారం పొందినవాళ్ళల్లో సెంట్ జాన్ పెర్స్ వి.ఎస్.నయిపాల్ తర్వాత వాల్కాట్ మూడవవాడు.
