ఇద్దరు మహారచయితలు

కానీ చాలా జీవితాలు పతాకకి చేరుకోకుండానే ముగిసిపోతాయి. మనుషులు మరణించేది, గొప్ప ఉద్రేకావస్థలో తీవ్ర స్థితికి చేరుకున్నాక కాదు, చాలా సార్లు, ఒక ఉత్తరం రాయడం మర్చిపోయి మరణిస్తారు. ఆర్కిటెక్చరంటూ ఏదీ లేదు. ఉన్నదంతా ఒక చిత్తుప్రతి, ఎన్నిసార్లు మూసినా సరిగ్గా మూసుకోని తలుపు.

ఆమె కన్నులలోన

కావ్యానందంలో  ఇది కూడా భాగమే. దేశకాలాల పరిమితుల్ని దాటి ప్రపంచమంతా కవుల హృదయాలు ఎక్కడెక్కడ ఒక్కలాగా స్పందించాయో ఆ తావుల్ని పట్టుకోవడం. ఏమీ తోచనప్పుడల్లా  మళ్ళీ మళ్ళీ అక్కడికి పోయి కొంతసేపు గడిపి వస్తూండటం. ..

సంధ్యాసమస్యలు

కానీ ఈ రోజు ఎందుకనో, ఏవో ఆలోచనల మధ్య, ఈ కవిత గుర్తొచ్చి, ఇన్నేళ్ళుగానూ ఈ కవితను అర్థం చేసుకోవలసినట్టే అర్థం చేసుకున్నానా అని అనుమానమొచ్చింది.