ప్రేమగోష్ఠి-8

అది కూడా వివరిస్తాను సోక్రటీస్. ఇప్పటిదాకా ప్రేమ ప్రాదుర్భావం గురించి చెప్పాను.  ప్రేమ ఒక సౌందర్యదాహం అని నువ్వు కూడా ఒప్పుకున్నావు. కాని ఎవరేనా అడగొచ్చు: సౌందర్యదాహం, నిజమే, కాని ఎవరి సౌందర్యం పట్ల? సోక్రటీసులోనా, లేక డయొటిమాలోనా? లేదా మరోలా అడగాలంటే, ఒక మనిషి అందాన్ని ప్రేమిస్తున్నప్పుడు, అతడు కోరుకుంటున్నదేమిటి?

ప్రేమగోష్ఠి-7

అంటే, సౌందర్యాన్ని కోరుకుంటున్నప్పుడు ప్రేమ మంచితనాన్ని కూడా కోరుకుంటున్నట్టేనా? 'నీ మాటలు ఖండించలేను సోక్రటీస్, సరే, నువ్వన్నట్టే అనుకుందాం' అన్నాడు అగధాన్. 'ప్రియమిత్రమా, నువ్వు చెప్పవలసిన మాట అది కాదు, ఇది: నేను సోక్రటీస్ ని ఖండించగలనేమోగాని, సత్యాన్ని ఖండించలేను'అని చెప్పు.

ప్రేమగోష్ఠి-6

హెసియోదూ, పార్మెనిడిసూ దేవతల కార్యకలాపం గురించి చెప్పినమాటలు నిజమే అనుకుంటే, అవన్నీ దేవతలు అవసరం కొద్దీ చేసినవి తప్ప, ప్రేమతో చేసినవి కావనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రేమదేవత ఉండిఉంటే, దేవతలు సంకెళ్ళలో తగులుకుని ఉండేవారు కాదు, వికృతరూపులయ్యేవారు కాదు. లేదా ఇంకా అలాంటివే హింసాత్మక చర్యలుండేవి కావు. వాటి బదులు,  ప్రేమ సామ్రాజ్యం మొదలయ్యాక ఇప్పుడు స్వర్గంలో కనవస్తున్నట్టే, అప్పుడు కూడా శాంతీ, మాధుర్యమూ వెల్లివిరిస్తూ ఉండేవి.