అంటే ఒక సౌందర్య శిఖరారోహణ అన్నమాట. అందులో అత్యున్నత శిఖరానికి చేరుకున్న ఆ సత్యాన్వేషి ఋషిగా మారి ఆ సోపానమార్గంలో కిందకి దిగి తన తోటిమనుషులకు తిరిగి ఆ దారిగురించి బోధిస్తాడని మనకి సింపోజియం చెప్పకనే చెప్తుంది. మనుషుల పట్ల ప్రేమలేకపోతే ఆ ఋషి తిరిగి మళ్ళా ఈ సాధారణ జీవితంలో అడుగుపెట్టవలసిన పనే లేదు.
ప్రేమగోష్ఠి-13
తన కాలం నాటి ఏథెన్స్ మానసిక దాస్యాన్ని సోక్రటీస్ కలవపరిచాడనీ, తన రాజకీయ దాస్యాన్ని భరించలేని ఏథెన్స్, తమ మధ్య మానసికస్వతంత్రుడిగా ఉన్న సోక్రటీస్ ని బలిగొన్నదనీ ప్లేటో మరింత సూక్ష్మంగా, మరింత సాహిత్యప్రతిభతో సింపోజియం ద్వారా వివరిస్తున్నాడని మనం గ్రహించినప్పుడు ఈ రచన మరింత ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది.
ప్రేమగోష్ఠి-12
కాని ఒక సారి ఆ ప్రతిమవక్షం చీల్చి అందులో ఏముందో చూసారా, ఇక నిజంగా అర్థవంతమైన మాటలంటూ ఉంటే అవి మాత్రమే అనిపిస్తుంది. అంతకన్నా దివ్యభాష, అంతకన్నా శీలసమన్వితమైన భాష మరొకటి లేదనిపిస్తుంది. అంత సమగ్ర అవగాహనతో, ఆ మాటకొస్తే, ఒక సజ్జనుడు, వందనీయుడు మాట్లాడవలసిన పద్ధతి అదే అనిపిస్తుంది.'
