యుద్ధమంటే ఎలా ఉంటుందో చూడని వాడు, యుద్ధం తన జీవితాన్నీ, తన వాళ్ళ జీవితాన్నీ అతలాకుతలం చెయ్యడమెలా ఉంటుందో తెలియనివాడు మాత్రమే తుపాకుల్నీ, బేయొనెట్లనీ, బుల్లెట్లనీ కీర్తిస్తూ కవిత్వం చెప్తాడు. కాని నిజంగా యుద్ధంలో మునిగిపోయినవాడు రాసే కవిత్వమలా ఉండదు. అదెలా ఉంటుందో చూడాలంటే దు-ఫు లాంటివాడి కవిత్వం చదవాలి.
అంటున్నాడు తుకా-13
నాట్యమూ, గానమూ నా శరణాలయాలు వాటిద్వారానే నేన్నిన్ను సేవించుకుంటాను. నీ నిద్రకు వేళైనప్పుడు సెలవు తీసుకుంటాను నువ్వు దిగివస్తే నా జీవితాన్నే హారతిస్తాను
అంటున్నాడు తుకా-11
దయ క్షమ శాంతి దేవుడు నివసించే స్థలాలివి.
