ఈ చిన్నారి హృదయాన్ని ఆశీర్వదించండి. నింగి నుంచి నేలకు ముద్దులు మూటగట్టిన ఈ చిట్టి తండ్రిని దీవించండి. వీడికి సూర్యుడి కాంతి అంటే ఇష్టం. వాళ్ళమ్మనే చూస్తూ ఉండటం ఇష్టం.
అంటున్నాడు తుకా-10
జీవితంలో నెగ్గాలనుకుంటే సాధనాలు రెండున్నాయి. మరొకరి సొమ్ముని ఏవగించుకోవటం మరొకరి భార్యను తలవకపోవటం.
అంటున్నాడు తుకా-9
నా మనోవాక్కాయకర్మసహితంగా దేవా! నీ శరణు వేడుకోడానికి వచ్చాను. నిన్ను కాక మరొకరిని మనసున తలవలేదు నా కోరికలు నీ పాదాలదగ్గరే పెట్టేసాను.
