ఈ మార్పుల వల్ల బైరాగి మూలకవితను మరింత ప్రభావశీలంగా, మరింత ఫలప్రదంగా తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. వృత్తపద్యాల వల్ల, ఆ అపురూపమైన శయ్యవల్ల, తన వేడికోలులో ఒక అవిచ్ఛిన్నతను, తెంపులేనితనాన్ని, ఏకోన్ముఖతను ఆయన అనితరసాధ్యంగా తీసుకురాగలిగాడు.
నన్ను వెన్నాడే కథలు-4
ఏ శాఖాగ్రంథాలయంలో దొరికిందో గాని రవీంద్ర కథావళి (1968) దొరికినరోజు నా జీవితంలో ఒక పండగరోజు. సాహిత్య అకాదెమీ కోసం మద్దిపట్ల సూరి అనువాదం చేసిన ఆ 21 కథలసంపుటం నాకు ఆ రోజుల్లో టాగోరు నా కోసం తెలుగులో రాసేడన్నట్టే ఉండేది.
నన్ను వెన్నాడే కథలు-3
నలభయ్యేళ్ళ కింద చదివిన ఈ పుస్తకం మళ్ళా ఇన్నేళ్ళకు ఇదే తెరవడం. కానీ ఆ చిన్నవయసులోనే నా మనసుకు హత్తుకు పోయిన కథ 'కొళాయిలో నీళ్ళు వచ్చినవి' ఇప్పుడు చదివినా అంత ఫ్రెష్ గానూ, అంత ప్రభావశీలంగానూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది.
