ఒక దుకాణం తెరిచాను వచ్చినవారందరికీ రెండుచేతులా పంచిపెడతాను. సాధువు ఎంత ఉదారుడు! ఎంత ఉదారుడు! ఆయన భాండాగారం తరుగులేనిది.
అంటున్నాడు తుకా-17
తమ సొంతబాగు చూసుకోని వాళ్ళు పక్కవాళ్ళ యిష్టాలకి అడ్డుపడతారు. దాంతో మరింత పాపం మూటగట్టుకుంటారు అది వాళ్ళ పతనానికి వేసిన మొదటి అడుగు. ..
అంటున్నాడు తుకా-16
ఎవరైనా సాధుసంతుల గోష్ఠి దొరికిందా నేను వాళ్ళింటిదగ్గర కుక్కలాగా పడుంటాను. అక్కడ రామనామసంకీర్తన వినగలుగుతాను వాళ్ళు తినగా వదిలిపెట్టింది తినిబతుకుతాను.
