అందులో ఉన్నది కేవలం టీ కాదు. అది నాగరికత పేరుమీద చలామణి అవుతున్న అనాగరిక పాశ్చాత్య జీవనదృక్పథం పట్ల ఒక మందలింపు. ప్రాచ్య సంస్కృతులు, చీనా, జపాన్, భారతదేశాల్లో మనిషి యుగాల తరబడి ఏ ఆధ్యాత్మిక సత్యాల్ని తన జీవనశైలిగా మార్చుకున్నాడో దాన్ని తెలియపరిచే ఒక మెలకువ.
పులికన్నా ప్రమాదకరమైంది
'ఇదే మనం గుర్తుపెట్టుకోవలసిన సూత్రం. దీన్ని రాజుగారి సింహాసనం పక్కన ఒక హెచ్చరికగా పెట్టారన్నమాట. ఏమి చెప్పడానికి? ఖాళీగా ఉంటే ఒరిగిపోతావు, మధ్యస్థంగా ఉంటే తిన్నగా ఉంటావు, పొంగిపొర్లావనుకో, తల్లకిందులవుతావు.'
సంపూర్ణంగా సఫలమయినట్టు లేదు
కాని ఎందుకనో నాకు ఈ కథల్లో నేను ఎదురుచూసిన ప్రగాఢత కనిపించలేదు. కథకుడు తన చుట్టూ ఉన్న జీవితాన్ని ప్రగాఢంగా అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టూ, తన అనుభూతి ప్రగాఢంగా ఉందని నమ్మినట్టూ అనిపిస్తోందిగానీ ఆ ప్రగాఢత్వం నాదాకా అందలేదు.
