కోవెన్ గీతాల్లో ఆ స్పృహ, ఆ రక్తి, ఆ విరక్తి రెండూ బలంగా కనిపిస్తాయి. అన్నీ చిన్న చిన్న మాటల్లో, ఊహించని అంత్యప్రాసల్లో, ఊహాతీతమైన మెటఫర్లతో. ఆ పాటలు శ్రోతల్ని సంగీతపరంగా ఎంత ఉద్రేకించగలవో, సాహిత్యపరంగా, పాఠకుల్నీ అంతే సమ్మోహితుల్ని చేయగలవు.
పోయిన ప్రాణం లేచొచ్చినప్పుడు
నిన్ను ప్రేమించే వాళ్ళ చేయూతకోసం ఎలుగెత్తి ఆహ్వానించు. నీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళకి ఎన్నోరూపాలు: వాళ్ళు జంతువులు కావచ్చు, పంచభూతాలు, పక్షులు, దేవదూతలు, సాధువులు, శిలలు , నీ పితృదేవతలు కావచ్చు.
భూమ్మీద మొలకెత్తిన నక్షత్రాలు
చెట్ల మీద మన దగ్గర ఏవైనా కవితా సంకనాలు వచ్చాయా? చెట్ల మీదనే ఎవరైనా కవి మొత్తం కవితలతో ఒక కవితల సంపుటి ఏదైనా వెలువరించాడా? చెట్లకు ఎవరైనా ఉత్తరాలు రాసారా?
