పుస్తక పరిచయం-38

వాల్ట్ విట్మన్ అమెరికను మహాకవి. ఆయన రాసిన Song of Myself ని ఆధునిక అమెరికను ఇతిహాసంగా పరిగణిస్తున్నారు. 52 సర్గల ఆ గీతాన్ని నేను ఆత్మోత్సవ గీతం పేరిట తెలుగు చేసాను. ఈ రోజునుంచీ ఆ పుస్తకాన్ని పరిచయం చేసే ప్రసంగాలు మొదలుపెడుతున్నాను. ఈ రోజు ప్రసంగంలో ఆ పుస్తకానికున్న చారిత్రిక నేపథ్యాన్ని వివరించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.

హోల్డర్లిను-6

సుప్రసిద్ధ జర్మను రొమాంటిక్ కవి హోల్డర్లిను కవిత్వాన్ని పరిచయం చేస్తూ గతంలో అయిదు పోస్టులు పెట్టాను. మధ్యలో ఆరునెలల విరామం. కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు, నేనూ నా మనసులో ఆ కవిత్వాని వదిలిపెట్టలేదు.

నన్ను వెన్నాడే కథలు-12

కానీ ఈ రోజు లూ-సన్ అనగానే నాకు గుర్తొస్తున్నది, నలభయ్యేళ్ళ కిందట, రాజమండ్రిలో చదివిన, ఆ దైవకుమారుడి కథనే. Wild Grass లోని Revenge II (1924). ఆ కథని నేను చదివిందే ఇంగ్లిషులో కాబట్టి, ఇప్పుడు మీకోసం నేనే తెలుగు చేయకతప్పింది కాదు.