ఆ యాభై ఆరు వ్యాసాల్నీ (అవును, యాభై ఆరు! అనుకోకుండా అలా కలిసొచ్చింది!) ఇప్పుడిలా 'తెలుగదేలయన్న' అని పుస్తకరూపంలో వెలువరిస్తున్నాను. 320 పేజీల ఈ పుస్తకం డిజిటలు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
నాలుగు పుస్తకాలు
పుస్తకాలు ముద్రిస్తామని చెప్పి వారం తిరక్కుండానే ఈ రోజు నాలుగు పుస్తకాలూ నా ఇంటికి చేరాయి. చాలా అందంగా ముద్రించారు. ధర కూడా మరీ ఎక్కువ పెట్టారనిపించలేదు. ఆసక్తి ఉన్న మిత్రులు వెంకటనారాయణగారిని సంప్రదించవచ్చు.
ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో
మనం అటువంటి పాఠకులం కావాలన్నదే నా జీవితకాల సాధన. అందులో భాగంగా, గతంలో ప్రపంచ కవిత్వం పైన నా స్పందనల్ని 'ఎల్లలోకము ఒక్క ఇల్లై' (2002) పేరిట మీతో పంచుకున్నాను. ఆ తర్వాత ఈ మూడేళ్ళుగా చదువుతూవస్తున్న కవిత్వం గురించి రాసిన 37 వ్యాసాల్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. 'ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో' అనే ఈ పుస్తకాన్ని ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
