శీలా వీర్రాజు

వీర్రాజు గారిని ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఆ తొలినాళ్ళ అద్భుత భావన, ఆరాధభావన నన్ను వెన్నాడుతూనే ఉండేవి. ఇరవయ్యేళ్ళ కిందట వాళ్ళింటికి వెళ్ళాను. అది ఇల్లు కాదు, ఒక కళాకృతి. ఒక అపురూప చిత్ర, శిల్ప సంచయశాల. మళ్ళీ అదే ఆశ్చర్యానుభూతి.

లేనిదల్లా నువ్వు మాత్రమే

. కాని ఆయన తన కొలీగ్స్, తన పై అధికారులు, చివరికి మంత్రులూ, ఎమ్మెల్యేలూ కూడా తన సాహిత్యాన్నీ, పద్యాల్నీ, అవధానాల్నీ చూసి విని ఆనందించాలని కోరుకునేవాడు. వాన పడ్డప్పుడు రాళ్ళమీదా, ముళ్ళమీదా కూడా కురిసినట్టే, ఆయన సాహిత్యవర్షం హెచ్చుతగ్గులు చూసేది కాదు.