చంద్రశేఖరరావు

ఎంతో సౌజన్యం, మృదుత్వం కూడుకున్న మనిషి, అతడు మాట్లాడుతుంటే, మల్లెతీగమీంచి పువ్వులేరుతున్నంత కుశలంగానూ, సున్నితంగానూ ఉండింది. ఒక కవినో, రచయితనో చూస్తుంటే, ఇప్పుడే దేవలోకంలోంచి దిగారా అన్నట్టు ఉంటుంది అన్నారొక సాహిత్యాభిమాని ఒకప్పుడు. ఆ రోజు చంద్రశేఖరరావు ని చూస్తే నాకట్లానే అనిపించింది

సాహితీవేత్త

బహుశా శ్రీ శ్రీ తర్వాత తెలుగులో శబ్దానికి అంత ప్రాధాన్యతనిచ్చిన కవి నారాయణరెడ్డి అనే అనిపిస్తున్నది. శబ్ద ప్రయోగ రహస్యం తెలిసినవాడు కాబట్టే ఆయన సినిమా పాటలు అంతగా జనాదరణ పొందేయి.

కవీశ్వరుడు వెళ్ళిపోయి

కాని ఆ గంభీరస్వరం, ఆ పద్యం, 'దొరవారూ' అంటూ పిలిచే ఆ పిలుపు మాత్రం మళ్ళీ వినబడలేదు, వినబడదన్న ఊహనే తట్టుకోవడం ఏడాది కింద ఎంతో కష్టంగా ఉండింది.