కవి, కథకుడు, సాహిత్యారాధకుడు, మహామనిషి మునిపల్లె రాజుగారు మొన్న రాత్రి ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు. నిన్న ఆయన పార్థివదేహాన్ని దర్శించుకున్నప్పుడు అస్తిత్వనదపు ఆవలితీరానికి చేరుకున్న ఆ మానవుడు నిశ్చింతగా కనిపించాడు.
స్వాతంత్ర్యవిద్యావంతుడు
మాష్టారి గురించి చాలా చాలా మాట్లాడాలనుకున్నాను. సాహిత్యవేత్తగా, చరిత్రకారుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకుడిగా, అన్వేషిగా, అద్వైతిగా ఆయన సాగించిన ప్రయాణం గురించి చెప్పాలనుకున్నాను.
డా. ధేనువకొండ శ్రీరామమూర్తి
డా. ధేనువకొండ శ్రీరామమూర్తిగారు లేరంటే చాలా బాధగా ఉంది. సహృదయుడు, సున్నితమనస్కుడు. మాటలోనూ, నడవడికలోనూ కూడా గొప్ప సంస్కారి. సున్నితమైన కవిత్వం చెప్పాడు
