శ్రీరామనాథ్ మరింత ప్రత్యేకం. ఈయన కవి. ఆయన పద్యం రాసినా, మరొకరి పద్యం గురించి రాసినా, కేవలం వచనం రాసినా కూడా ఆ వాక్కు ఎంతో సంస్కారవంతంగానూ, ఎంతో వినయనమ్రంగానూ ఉంటుంది. అత్యంత ప్రౌఢ వాక్కు. ..
బసవన్న ముగ్ధభక్తి
బసవన్న వచనాలనుంచి మూడువందల వచనాలు ఎంపికచేసి నేను తెలుగులోకి అనువదించి పుస్తకంగా వెలువరించిన సంగతి మీకు తెలిసిందే. కిందటి డిసెంబరులో తీసుకువచ్చిన ఆ పుస్తకం మీద ఇన్నాళ్ళకు ఒక నిండైన సమీక్ష లభించింది. ఆత్మీయులు న్యాయపతి శ్రీనివాసరావు బసవన్న పట్ల అపారమైన గౌరవంతోనూ, నా పట్ల అపారమైన అభిమానంతోనూ రాసిన ఈ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
ఒక ఉత్తరం అందింది
పోస్టు చేసిన ఉత్తరాలు పుస్తకంగా వెలువరించిన వెంటనే జవాబుగా నిన్ననే నాకో ఉత్తరం అందింది. ఇది సోమశేఖర్ రాసిన ఉత్తరం. ఈ జవాబు చదవగానే నేను రాసిన ఉత్తరాలు చేరవలసిన చోటుకే చేరాయనిపించింది. అందుకని ఆ ఉత్తరాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను.
