వేమన గురువు అంటే సాంప్రదాయిక అర్థంలో గురువు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి అత్యవసరమైన జీవనవిద్యను ప్రతిపాదిస్తున్న గురువు అని కూడా. అంటే, చాలా మనకి సుపరిచితంగా, ఇంక వాటిల్లోంచి కొత్తగా ఏ అర్థాలూ స్ఫురించడానికేమీ లేదనే పద్యాల్లో కూడా వేమన మనకి సరికొత్తగా వినిపిస్తున్నాడు.
పూల మీద వాలిన తేనెటీగ
ఈ వ్యాసాలు కావ్యానందానికి నిక్కపు నిరూపణలు. ఇందులో ప్రతి ఒక్క కవినీ ఆయనా తిరిగిమళ్ళా కవిత్వపు వెలుగులోనే పోల్చుకోడానికి ప్రయత్నించారు. వాళ్ళ కవిత్వాన్ని మళ్ళా కవిత్వపురంగుల్లోనే వర్ణించారు.
మెలకువలో కన్న కల
మెలకువలో కన్న కల! మండేలా జీవితానికి ఇంతకన్నా సముచితమైన పదం మరొకటి కనిపించదు.
