ఈ నెల రెండో తేదీన రావిశాస్త్రి పురస్కారవేదిక సభలో నా 'కథలసముద్రం' పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా డా.కొర్రపాటి ఆదిత్య ఆ పుస్తకాన్ని పరిచయం చేసారు. ఒక తరానికి చెందిన రచయితకి తన తర్వాతి తరం నుంచి ఇటువంటి మూల్యాంకనం దొరకడం నిజంగా భాగ్యం
స్వర్ణయుగానికి స్వాగతం
కాని ఇప్పుడు ఈ ఉత్తరాలు చదివేక నాకు చాలా సంతోషంగానూ, ధైర్యంగానూ ఉంది. కవులు ఎప్పుడూ ఉంటారు, కాని కావలసింది సహృదయులు. వాళ్ళకి తన హృదయాన్నొక ఆశ్రయంగా మార్చగల తగుళ్ళ గోపాల్‌లాంటి సహృదయులు కనబడితే ఇదుగో, స్వర్ణయుగానికి స్వాగతం అనాలనిపిస్తుంది.
సృష్టిగర్భ: ఉపనిషత్కాంతి
దీర్ఘాసి విజయభాస్కర్ కవిగా, రచయితగా, నాటకకర్తగా, సమర్థుడైన అధికారిగా ఇప్పటికే తెలుగుప్రపంచానికి పరిచయం. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఆయన ఈ స్థితికి చేరుకోవడమే ఒక జయగాథ, అతడు పుట్టిపెరిగిన ప్రాంతానికీ, ఆ కుటుంబాలకీ మాత్రమే కాదు, మనందరికీ కూడా. కానీ అతడు ఇంతదాకా అధిరోహించిన ఎత్తులు ఒక ఎత్తు. ఈ పుస్తకం ద్వారా చేపట్టిన ఆరోహణ మరొక ఎత్తు.
