ఏ విధంగా చూసినా ఈ కథనాలు చదవడం గొప్ప అనుభవం. వనవాసి నవలలో కనిపించే మహాలిఖారూప పర్వతశ్రేణి లాంటిదే మన మధ్య మన ప్రాంతంలో మనకూ ఉందనీ, అటువంటి లంకమల శ్రేణులు తమ వనవాసిని వివేక్‌లో వెతుక్కున్నాయనీ మనకి స్ఫురిస్తుంది.
ఈ పరిశీలన ఒక ఒరవడి
ఒక సుప్రసిద్ధ ఇండాలజిస్టు, శాంతియోధుడు, ప్రాచ్యపాశ్చాత్యభాషావేత్త అయిన షూల్మన్ ప్రేమనీ, ప్రశంసనీ ఇంతగా కొల్లగొట్టుకున్నా కూడా రామచంద్రారెడ్డి ఆ మాటలు ఎక్కడా రాసుకోడు, చెప్పుకోడు. అందుకని, ఇదుగో, ఈ నాలుగు వాక్యాలూ ఆయన గురించే రాసే అవకాశం నాకిన్నాళ్ళకు ఈ రూపంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఒక అత్యవసర బాధ్యత
అమృతా ప్రీతమ్ ఈ నవల ఎంతో బాధ్యతతో రాసింది. అంతే బాధ్యతతో పూర్ణిమ దీన్ని తెలుగు చేసింది. ఈ రచనని ఆవిష్కరించడం నాకు గౌరవం, కానీ అంతకుమించిన బాధ్యత.
