ఆ ప్రసంగమే ఒక పురస్కారం

సుంకర గోపాల్ ని మొదటిసారి విజయవాడలో కొన్ని శేఫాలికలు ఆవిష్కరణ రోజు విన్నాను. అంత అనర్గళంగా, అంత భావస్ఫోరకంగా మాట్లాడే వక్తల్ని ఈ తరంలో నేను చూడలేదు. ఎంత భావోద్వేగంతో మాట్లాడుతున్నా ఎక్కడా ఔచిత్యం, సంయనమం కోల్పోని వాగ్ఝరి ఆయనది.

కవిత్వహిమాలయ సంచారి

ఇంగ్లిషులో phenomenon అని ఒక పదం ఉంది. కంటికి కనిపించే ఒక యథార్థమైన విషయం అనే అర్థంలోనే కాకుండా, మనల్ని అబ్బురపరిచే ఒక మనిషిని సూచించడానికి కూడా ఆ మాట వాడతారు. నాగరాజు రామస్వామిగారిని అభివర్ణించాలంటే ఆయన ఒక phenomenon అని అనాలి

ప్రేమవల్ల మాత్రమే సాధ్యమయ్యే రచన

సంధ్యగారు ఇంతకు ముందు తన గురువు ఎవరో తెలుసుకోడానికి చేసిన తన ప్రయాణాన్ని పుస్తకంగా రాసారు. ఇది కూడా ఆ అన్వేషణకు సమానమైన అన్వేషణనే. ఎందుకంటే టాగోర్‌ చెప్పినట్టు మనిషి జీవితంలోని సత్యాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే నిజమైన యోగసాధన. అది ప్రేమ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.