యత్ర విశ్వం భవతి ఏక నీడమ్

టాగోర్ శాంతినికేతనం స్థాపించినప్పుడు ఆ భవనం మీద 'యత్ర విశ్వం భవతి ఏక నీడమ్' అని రాసిపెట్టుకున్నాడు. అంటే ఎక్కడ సమస్త విశ్వమూ ఒక గూడుగా మారుతుందో అటువంటి చోటు కావాలి తన పాఠశాల అని అనుకున్నాడాయన. తుమ్మపూడిలో సంజీవ దేవ్ గారింట్లో నాకు ఆ వాక్యమే పదే పదే గుర్తొస్తూ ఉంది. అక్కడ సమస్త విశ్వమూ ఒక కులాయంగా మారింది.

దేవాలయాల ఆల్బమ్

భారతీయ దేవాలయ వాస్తుకి ఐహోలుని ఊయెలతొట్టిగా చరిత్రకారులు అభివర్ణిస్తూ ఉంటారు. కాని ఐహోలు, పట్టడకల్లు భారతీయ దేవాలయ నిర్మాణరీతికి cradle అయితే, అలంపురం భారతీయ దేవాలయ వికాసం తాలుకు album.

ఋతుపవనాల అడుగుజాడల్లో

ఒక కొత్త ద్వీపాన్నో, ఒక శిఖరాన్నో, ఒక కొత్త సముద్రాన్నో వెతుక్కుంటో ప్రయాణాలు చేసిన సాహసికుల గురించి విన్నాంగాని, ఋతుపవనాల వెంబడి అవి సాగే దారిన తాను కూడా సాగాలని కోరుకున్నవాళ్ళెవరయినా ఉంటారా?