వాళ్ళ ఋణం ఎప్పటికి తీర్చగలుగుతాను?

ఇక్కడ ఆకాశం మరీ పొద్దున్నే తెరుచుకుంటుంది. రాత్రంతా చినుకుతూనే ఉన్నా, ఆకాశమంతా కరిగిపోయి ఉన్నా కూడా, తడిసిపోయిన తెరవెనకనుంచి వెలుతురు ఆవరిస్తూనే ఉంది.పొలాలమీద, తాటిచెట్లమీదా వంగిన ముసురుమబ్బు.  జీవితంలో తెరుచుకుంటున్న కొత్త పుటల్లో పాతలిపిని, ఒకప్పుడు నేర్చుకున్న అక్షరాల్నీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాను

హైదరాబాదునుంచి విజయవాడకి

చాలా ఏళ్ళ తరువాత మళ్ళా హైదరాబాద్ నుంచి స్థానచలనం. రేపే హైదరాబాద్ వదిలి విజయవాడ ప్రయాణం. సోమవారం నుంచీ గిరిజనసంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో విజయవాడలో పనిచేయబోతున్నాను.

కొత్త అనుభవం

జీవితంలో గొప్ప కళల్లోనూ, గొప్పనైపుణ్యాల్లోనూ, ముఖ్యమైన సందర్భాల్లోనూ, మనం పాటించే రెండు విలువలు, measurement, judgment అన్నిటికన్నా ముందు వంట వండటంలో చాలా అవసరమని గ్రహించేను. సాధారణ జీవితంలో చాలా సాధారణంగా జరిగిపోయే పనులని భావించే వంటలోనూ, డ్రైవింగ్ లోనూ, ఈ రెండు నైపుణ్యాలూ దాదాపుగా విలువలస్థాయికి చేరుకున్నాయని కూడా అర్థమయింది.