1987 లో పార్వతీపురం ఐ.టి.డి.ఏ లో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా చేరినప్పుడు అప్పుడు ప్రాజెక్టు అధికారిగా ఉన్న ఏ సుబ్రహ్మణ్యంగారి దగ్గర నా జాయినింగ్ రిపోర్టు ఇచ్చానో ఇప్పుడు ఛీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆ సుబ్రహ్మణ్యంగారిదగ్గరే నా ఐ.ఏ.ఎస్ జాయినింగ్ రిపోర్టు సమర్పించాను. నా ఉద్యోగజీవితంలో ఒక వలయం పూర్తయ్యింది.
ఫాల్గుణపూర్ణిమ
నీ కోసమొక పడవ ఎదురుచూస్తున్నదని తెలియడంలో మాటల్లో పెట్టలేని స్ఫూర్తి ఏదో ఉన్నది. మరుక్షణంలో నువ్వు ఈ తీరాన్ని వదిలిపెట్టగలవని తెలియడంలో గొప్ప విమోచన ఉన్నది.
రుద్ర పశుపతి
ఇందులో మతాన్ని పక్కన పెట్టండి, పశుపతీ, రుద్రపశుపతీ ఇద్దరూ నిజంగా ఉన్నారా లేరా అన్నది పక్కన పెట్టండి. కానీ, నిజంగా అట్లా నమ్మగలుగుతున్నామా మనం దేన్నయినా, మన స్నేహాల్నైనా, మన సిద్ధాంతాల్నైనా, చివరికి మన హృదయస్పందనల్నైనా?
