అందులో మనకు బాగా తెలిసిన పార్శ్వాలు- బారిష్టరు, నేతపనివాడు, గ్రంథ రచయిత, పాత్రికేయుడు, ముద్రాపకుడు-ప్రచురణ కర్త వంటి వృత్తులతో పాటు మనకు అంతగా వివరాలు తెలియని కార్మిక జీవిత పార్శ్వాలు- బట్టలుకుట్టేవాడు, బట్టలు ఉతికేవాడు, క్షవరం చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, వంటవాడు, వైద్యుడు, నర్సు, రైతు వంటి వాటి చిత్రణ కూడా ఉంది.
నూరు పువ్వులు వికసించనీ
కవిత్వం ఇలానే రాయాలని ఎప్పటికీ ఎవరికీ చెప్పలేం. కవిత్వం లీగల్ డాక్యుమెంటు కాదు, రాజకీయ పార్టీలు సమావేశాలు అయిపోయిన తర్వాత బయట మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ కి వివరించడంకోసం రాసిపెట్టుకునే ప్రెస్ నోట్ కాదు. కవిత్వంలో ఆచి తూచి పదాలు వాడతాము కానీ, అది వేరే తరహా 'మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్'. కవిత్వం ఒక మనిషి తన వ్యక్తావ్యక్తాల్ని రెండు చేతుల్తోనూ బాలన్స్ చేసుకునే ప్రక్రియ.
మరొకసారి అడవిదారుల్లో
ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.
