ఇంకా తెల్లవారని వేళ అయిదో అంతస్థులో ఉన్న నీగదిలోకి నీళ్ళు ప్రవహించినట్టు వేపపూల గాలి.
ప్రళయాంతవేళ
ప్రళయం ముంచెత్తిన ప్రతి యుగాంతవేళా, నాతో పాటు, వటపత్రప్రమాణంకలిగిన కించిదూర్జిత స్ఫూర్తికూడా ఒకటి జీవించి ఉండటం కనుగొన్నాను
హేమంత చంద్రిక
ఆకాశంలో నువ్వు ఎప్పుడు కనబడ్డా పాటలు పాడుకుందాం రమ్మని ప్రతి ఇంటి తలుపూ తట్టాలనిపిస్తుంది.
