అజ్ఞాత వాసంలో ఉన్న చిత్రకారుడెవరో తన తైలవర్ణాలిక్కడ దాచుకున్నట్టుగా కొంత పసుపు, కొంత తెలుపు, కొంత రక్తం ముద్దగా మూటగట్టుకున్నట్టు ఒక మొగ్గ.
కుహూరవం
నా ఎదుట ఉన్న ఫోటోలో చిన్నప్పటి ముఖాన్ని వెతుక్కున్నట్టు ఈ మార్చి ఎండలో ఒకప్పటి వసంతాన్ని పోల్చుకుంటున్నాను.
ఆ ఒక్క క్షణమే
సగం తవ్విపోసిన ఇనుపఖనిజం లాగా సికింద్రాబాదు రైల్వే స్టేషను.
