నీ ఇంటికొచ్చినవారిచేతుల్లో ఈ పూట ఒక పూలగుత్తి పెట్టు. ఎవరికి తెలుసు? కొత్త సంవత్సరం వారిచరణాలతో నీ ఇంట అడుగుపెడుతూండొచ్చు.
ఉత్తర ద్వారం
ఈ కాలమంతా ఒక తలుపు తెరుచుకుంటూనే ఉంటుంది అది కనబడేది కాదు వినబడేది. ..
ఈ కాలమే అలాంటిది
లెక్కపెట్టాను. మొత్తం పందొమ్మిది. నాసరరెడ్డి పందొమ్మిది కవితల్లాగా పందొమ్మిది గులాబి మొక్కలు.
