పండుగుమ్మడికాయమీద పరుచుకున్న పూతలా ఫిబ్రవరి సూర్యకాంతిమీద పలచని మంచుపొర.
కలలు తేటపడతాయి
గాలి పీలుస్తూ బతుకుతూనే నువ్వొక నాటికి కాంతిపీల్చుకుంటే తప్ప బతకలేని స్థితికి చేరతావు. అప్పుడు నీకు వెలుగుతప్ప మరేదీ రుచించదు.
రెండో చరణం
నిండుగా పూసిన ప్రతి మామిడి చెట్టూ నేను పోగొట్టుకున్న దాన్ని నేను నిజంగా పోగొట్టుకోలేదనే చెప్తుంది.
