ఇప్పుడు చెప్పగలను, తెలంగాణా చరిత్రకు సాక్ష్యం చెప్పే మూజియం హైదరాబాదులో చూడాలంటే స్టేట్ మూజియం కి వెళ్ళండని.
60,000 వేల ఏళ్ల వెనక్కి
అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో చేపట్టబోయే తవ్వకాల్లో ఒక మానవ శిలాజంగాని లభిస్తే అంతకన్నా గొప్ప అదృష్టం మరొకటి ఉండదు. ఒక తుంటి ఎముకగాని, ఒక పుర్రె గాని కనీసం ఒక దంతం దొరికినా కూడా అది ప్రపంచ మానవ చరిత్రలో భారతదేశానికి గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టగలదు.
కొండాపూర్ లో ఒక మధ్యాహ్నం
కాని, ఇక్కడి పరిస్థితి చూడండి. ఇప్పటికి రెండువేల ఏళ్ళకిందట తెలంగాణాలో ఒక పట్టణం ప్రముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. రోమ్ తో సాతవాహనులు నడిపిన వ్యాపారం లో ఆ పట్టణం ఎంత ప్రముఖ పాత్ర పోషించిందంటే అక్కడ ఒక రోమన్ సెటిల్ మెంట్ నే ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. కాని ఆ ప్రాంతాన్ని చూడటానికి ఇప్ఫుడెవరికీ ఆసక్తి లేదు.
