పోరాటకారుడు

ఉన్నతస్థానాల్లో ఉన్న అవినీతిని ఎత్తిచూపాలన్నది ప్రతి ఒక్కరూ చెప్పేదే గాని, ఆ ఉన్నతస్థానాలు తమ దైనందిన జీవితంలో భాగమయినప్పుడు పోరాటం చేసేవాళ్ళు మనకేమంత ఎక్కువమంది కనబడరు. ఎక్కడో ఉన్న పాలకుల్ని విమర్శించడం చాలా సులువు. కాని, నీ కార్యాలయంలో నువ్వెవరికింద పనిచేస్తున్నావో వాడి అవినీతిని ప్రశ్నించడం చాలా కష్టం. రూపురేఖల్లేని 'రాజ్యం' అనే ఒక శక్తిని విమర్శించడం చాలా సులువు. కానీ, నీ స్థానిక శాసనసభ్యుణ్ని విమర్శించడం చాలా కష్టం.