మనిషికి కావలసింది ఆరడుగుల నేలనో లేదా చిన్నపాటి సుక్షేత్రమో కాదు. అతడికి మొత్తం భూగోళం అవసరం కావాలి, మొత్తం ప్రకృతి కావాలి, తనలోని స్వేచ్ఛాజీవి తన కౌశల్యాల్ని, అద్వితీయతల్ని మొత్తం బయటకు తేవడానికి అవసరమైన అవిరళ ఆకాశం కావాలి
నేపథ్యం
అబ్బులుబాబు జుట్టు పీక్కున్నాడు. తుఫానులో నౌకలు చిక్కుకున్నప్పుడు ముసలి సరంగులు జుట్టుపీక్కున్నట్టు. ‘ఆడలేం, ఆడలేం అంటున్నాను.’
గృహోన్ముఖంగా..
ఆ స్త్రీలూ, ఆ ఆడపిల్లలూ వాళ్ళ గోష్ఠుల్లో ఏమీ పాటలు పాడలేదు. కాని ఎడ తెరపి లేకుండా కబుర్లు చెప్పుకొన్నారు. మధ్యలో ఏ కారణాలు పురస్కరించుకునో కన్నీళ్ళు, వోదార్పులు. ఒకళ్ళకొకళ్ళు జడలల్లు కున్నారు.
