నా జీవితంలో ఎంతోమందిని చూసాను, ఎందరో బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు. కానీ ఇప్పుడు ఈ క్షణాన్న వాళ్ళ ముఖం ఒక్కటి కూడా నా కళ్ళముందు కనిపించడం లేదు. కాని ఆ ఏకాంత అపరాహ్ణం, ఆ నిశ్శబ్దగ్రామసీమ అవి నా కోసం ఎన్నటికీ చెరగని నీడ పరిచినట్టనిపిస్తుంది. నేను ఆగిపోయిందక్కడ, ఆ నీడ దగ్గర, ఆ గూడు దగ్గర, ..’
ఉసిరికాయలు
మనిషికి కావలసింది ఆరడుగుల నేలనో లేదా చిన్నపాటి సుక్షేత్రమో కాదు. అతడికి మొత్తం భూగోళం అవసరం కావాలి, మొత్తం ప్రకృతి కావాలి, తనలోని స్వేచ్ఛాజీవి తన కౌశల్యాల్ని, అద్వితీయతల్ని మొత్తం బయటకు తేవడానికి అవసరమైన అవిరళ ఆకాశం కావాలి
నేపథ్యం
అబ్బులుబాబు జుట్టు పీక్కున్నాడు. తుఫానులో నౌకలు చిక్కుకున్నప్పుడు ముసలి సరంగులు జుట్టుపీక్కున్నట్టు. ‘ఆడలేం, ఆడలేం అంటున్నాను.’
