
నిన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి పుట్టినరోజు. ‘కృష్ణపక్షం’ లోని కవిత్వం సరే, సినిమా పాటల పేరు మీద కూడా ఆయన ధారాళంగా నిర్మలకవిత్వాన్ని దోసిళ్ళతో వెదజల్లాడు. కృష్ణశాస్త్రి ఫిల్ము గీతాల్లో కవిత్వం గురించి 2007 లో చేసిన ప్రసంగం ఈ రోజు మళ్ళా మీతో పంచుకుంటున్నాను.
1-11-2025


చాలా బాగుందండీ… నాకు చాలా ఇష్టమైన మరి కొన్ని పాటలు…
ఘనా ఘనా సుందరా… కరుణా రసమందిరా..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు..
పాతాళ గంగమ్మ రారారా..
చుక్కలతో చెప్పాలని…
పగలైతే దొరవేరా…
మావి చిగురు తినగానే…
ఈ గంగ కెంత దిగులు…
ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం…
చుక్కలు పాడే శుభమంత్రం… Etc.,
అన్నిటికన్నా చాలా చాలా ఇష్టం..
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు…
వాటి మీద మీరు ఒక ప్రసంగం చేయగలరు.
చాలా బాగా విశ్లేషించారు.
ఆద్యంతం అపూర్వ ప్రసంగం.కృష్ణ శాస్త్రి కూడా తన గురించి తాను విశ్లేషించుకున్నారో లేదో తెలియదు కానీ మీరు ఎంత రసానందాన్ని అనుభవించారో అక్షరాక్షరం తెలుపుతుంది. ఈ రోజును ప్రకాశమానం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్
అద్భుతంగా ఉంది కృష్ణశాస్త్రిని గురించి మీ ప్రసంగం.
మీ వల్ల ఆ మహాకవిని మళ్ళా తలుచుకొని
పులకించింది మా అంతరంగం
ధన్యవాదాలు సర్.
ధన్యవాదాలు సార్!
సర్ నమస్కారం దేవులపల్లి వారి పాటకు ధీ టైన మీ విశ్లేషణ అత్యద్భుతంగా కొనసాగి నాకున్న ఉన్నతమైన ఉత్తమమైన సాహిత్య రసాస్వాదన పరిమళభరితమైంది. ఆంధ్ర దేశంలో ప్రస్తుతం ఈ స్థాయిలో విశ్లేషించగలిగిన సాహిత్య విశ్లేషకులు చాలా తక్కువ మంది ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది ధన్యవాదాలు నమస్కారం
హృదయపూర్వక ధన్యవాదాలు సార్.